నేపాల్ వరదల్లో అద్భుతం.. చీకటి గుహలో 9 రోజులు .. తిండి, నీళ్లు లేక నరకం

నేపాల్ వరదల్లో అద్భుతం.. చీకటి గుహలో 9 రోజులు .. తిండి, నీళ్లు లేక నరకం
  • నేపాల్​ వరదల నుంచి 
  • బయటపడిన ఇద్దరు కార్మికులు 
  • సుమారు 170 మీటర్ల లోతులో 
  • సహోద్యోగుల్ని పంపి.. టన్నెల్‌‌‌‌లోనే చిక్కుకున్నరు
  • అత్యాధునిక యంత్రాలతో కొండను తొలిచిన రెస్క్యూ టీమ్​

ఖాట్మండు: తీవ్ర విషాదంలో అద్భుతం చోటుచేసుకుంది. మృత్యువు ఒడిలోకి జారారనుకున్న ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న వారిని నేపాల్ ఆర్మీ సహాయక బృందాలు శుక్రవారం సురక్షితంగా వెలికితీశాయి. వారిని ప్రాజెక్ట్ మెకానికల్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్ కబీర్ మహర్జన్ (45), ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ సంజయ్ సాహ్ (30)గా ఆర్మీ గుర్తించింది. తీవ్ర అస్వస్థతకు గురైన కబీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖాట్మాండులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

సంజయ్ సాహ్ నువాకోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. గత నెల  26న రసువా ప్రాంతంలోని భోటేకోశీ నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు త్రిశూలి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్ కేంద్రాలను అతలాకుతలం చేశాయి. కొండచరియలు, బండరాళ్లు, బురద నీరు భారీ ఎత్తున వచ్చి చేరడంతో త్రిశూలి 3ఏ టన్నెల్ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. వరద నీరు ముంచెత్తినప్పుడు కార్మికులు ప్రాణభయంతో సొరంగం ఎగువ భాగానికి పరుగులు తీశారు.  సహోద్యోగుల కోసం ఆగి మరికొందరు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.

నేపాల్ సైన్యం నేతృత్వంలో రెస్క్యూ బృందాలు గత అత్యాధునిక యంత్రాలతో కొండంత శిథిలాలను తొలగిస్తూ, లోపలికి ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపుతూ అలుపెరగని శ్రమ చేశాయి. భారీ రాళ్లను పేల్చివేస్తూ రెస్క్యూ సిబ్బంది లోపలికి దారి చేసుకున్నారు. సొరంగంలో వెలుతురు లేదు.. తినడానికి తిండి లేదు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కేవలం అక్కడ దొరికిన కాసిన్ని నీటి చుక్కలతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు నిలబెట్టుకున్నారు. తొమ్మిది రోజుల పాటు చీకటి సొరంగంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన సంజయ్.. ఆ సమయంలో కేవలం ‘హరే కృష్ణ’ మంత్రాన్ని జపిస్తూ ధైర్యం తెచ్చుకున్నట్టు తెలిపారు. యాదృచ్ఛికంగా కృష్ణాష్టమి రోజే సహాయక బృందాలు ఆయనను గుర్తించి బయటకు తీసుకువచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాత టన్నెల్ రెస్క్యూ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఈ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘అసాధారణమైనది’గా పేర్కొన్నారు. ఇలాంటి సహాయక చర్యలను ప్రపంచం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం నేపాల్​లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తులో ఇప్పటికే 1,280 మందికి పైగా మరణించగా, 5,500 మంది ఆచూకీ ఇంకా చిక్కలేదు.