గోషామహల్, వెలుగు: ఓ బాలుడు(16) బ్లేడ్ముక్కలను మింగిన మింగగా.. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వాటిని ఎండోస్కోపీ ద్వారా తొలగించారు. గురువారం తెల్లవారుజామున బ్లేడ్ముక్కలను మింగిన మహ్మద్ ముజిబుర్ రెహమాన్‌ను కుటుంబసభ్యులు ఉస్మానియా జనరల్ సర్జరీ విభాగంలో చేర్చారు. ఎక్స్‌రే తీయించగా బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
కడుపు, పేగులకు గాయాలు లేదా చిల్లులు పడే ప్రమాదం ఉండటంతో బాధితుడిని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి తరలించారు. హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్ నేతృత్వంలో మినిమల్లీ ఇన్వాసివ్ ఎండోస్కోపిక్ విధానంలో బ్లేడ్ ముక్కలను విజయవంతంగా తొలగించారు. చికిత్స అనంతరం బాలుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకున్నాడని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని హాస్పిటల్సూపరింటెండెంట్కార్యాలయం వెల్లడించింది.
