అన్డూ విత్ జండూ పేరుతో..జండూ బామ్ కొత్త ప్రచారం షురూ

అన్డూ విత్ జండూ పేరుతో..జండూ బామ్ కొత్త ప్రచారం షురూ

హైదరాబాద్​, వెలుగు: ఆయుర్వేద బ్రాండ్ జండూ బామ్ యువత కోసం ‘అన్​డూ విత్ జండూ’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా స్క్రీన్ టైమ్ తలనొప్పులు, టెక్ నెక్, డూమ్ స్క్రోలింగ్ అలసట వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ యాడ్​ను టీవీ, డిజిటల్, ఓటీటీ, సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. నొప్పులకు క్షణాల్లో సత్వర ఉపశమనం కల్పించడమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశమని జండూ బామ్ ​తెలిపింది. నొప్పుల కోసం వాడే బామ్‌‌‌‌‌‌‌‌లకు రూ.1,500 కోట్ల మార్కెట్ ఉందని సంస్థ  పేర్కొంది.