NSE ఐపీఓకు ఓకే ..ఇష్యూ సైజు రూ.30 వేల కోట్లు

NSE ఐపీఓకు ఓకే ..ఇష్యూ సైజు రూ.30 వేల కోట్లు

ముంబై: ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) రూ.30 వేల కోట్ల విలువైన ఐపీఓకు సెబీ నుంచి తుది ఆమోదం లభించింది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. దీని ద్వారా సుమారు 14.89 కోట్ల షేర్లను అమ్ముతారు. స్టేట్​బ్యాంక్​ దాదాపు 2.48 కోట్ల షేర్లను, ఎంఎస్ స్ట్రాటజిక్ సంస్థ 1.60 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. ఎన్​ఎస్​ఈ షేర్లు ఈ నెల 20 తరువాత లిస్ట్​ అవుతాయని అంచనా. 

ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఐదు లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో హ్యుందాయ్ రూ.27,870 కోట్ల ఇష్యూ రికార్డును ఇది దాటనుంది.  ఆన్​లైన్ ఫర్నిచర్ అండ్ అప్లయెన్సెస్ రెంటల్ ప్లాట్​ఫారమ్​ రెంట్​మోజో రూ.1,256 కోట్ల ఐపీఓ కోసం ఒక్కో షేరు ధరను రూ.384 నుంచి రూ.404 మధ్య నిర్ణయించింది.  ఇందులో రూ.150 కోట్ల తాజా ఈక్విటీ షేర్లు, రూ.1,106 కోట్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి.  

ఇదిలా ఉంటే, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ రూ.805 కోట్ల ఐపీఓ ప్రైస్​బ్యాండ్​ను రూ.322–రూ.339 నిర్ణయించింది. ఈ రెండు కంపెనీల షేర్లకు 9–11 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.