- ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: హోంఫర్నిచర్ సెల్లర్ స్టాన్లీ తన లగ్జరీ హోమ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించింది. ఆరు అంతస్తుల్లో ఈ భారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఏర్పాటయింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫర్నిచర్, కిచెన్స్, వార్డ్‌రోబ్లు, లైటింగ్, డెకార్, ఆర్ట్ వంటి అన్ని రకాల లగ్జరీ వస్తువులు ఇక్కడ లభిస్తాయి. జర్మనీ, జపాన్, స్పెయిన్, బెల్జియం దేశాలకు చెందిన ప్రముఖ బ్రాండ్ల సహకారంతో ఈ ఉత్పత్తులను రూపొందించామని కంపెనీ చైర్మన్ సునీల్ సురేష్ పేర్కొన్నారు
