- ఫండ్స్ సేకరించేందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చర్చలు
న్యూఢిల్లీ: జర్మన్ ఆటో కంపెనీ ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 50 వేల మందిని తీసేయబోతోంది. ఇండియాలోని తమ మొత్తం సిబ్బందిలో దాదాపు 12 శాతాన్ని తగ్గించేందుకు సిద్ధమవుతోంది. 2025లో ప్రకటించిన మూడేళ్ల రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్‌ను 2027 నాటికి పూర్తి చేయనుంది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియాలో దాదాపు 4,500 మంది పనిచేస్తున్నారు.
కంపెనీ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12 శాతం మేర కోత విధించనుంది. అంటే సుమారు 500 మంది ఉద్యోగులను తీసేయనుంది. ఈ కోతల్లో కార్పొరేట్ ఆఫీసుల్లోని వైట్-కాలర్ (మేనేజ్మెంట్, అడ్మిన్) సిబ్బందితో పాటు, ప్లాంట్లలో పనిచేసే షాప్-ఫ్లోర్ సిబ్బంది కూడా ఉంటారు. ఇండియాలో గత 20 ఏళ్ల నుంచి ఫోక్స్ వ్యాగన్ బిజినెస్ చేస్తున్నా, మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలతో పోటీని తట్టుకుని విస్తరించడంలో సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం తమ బిజినెస్ స్ట్రాటజీని పూర్తిగా మార్చాలని చూస్తోంది. అయితే భవిష్యత్తులో లోకల్ ఇంజనీర్లను నియమించుకుంటామని కంపెనీ సీఈఓ పీయూష్ అరోరా తెలిపారు. భారత్‌ను కీలక ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఫండ్స్ సేకరించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు మెజారిటీ వాటాను విక్రయించేందుకు కంపెనీ చర్చలు జరుపుతోంది.
