రాజన్న సిరిసిల్ల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది! విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది.సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను ఉదయం పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు అప్రమత్తమయ్యారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద వార్త తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై ఆసుపత్రికి పరుగులు తీశారు. అసలు ఈ ప్రమాదానికి ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతివేగమే కారణమా? లేక నిర్లక్ష్యమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
