- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో..
- కొడిమ్యాల టూ పూడూర్ వరకు బైక్ ర్యాలీ
కొడిమ్యాల,వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ముగించుకున్న నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం నుంచి పూడూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెయ్యి రోజుల పాలనలో అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు 500 బోనస్ తదితర పథకాలను అందజేసినట్లు చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
