గోదావరిఖని/రాయికల్, వెలుగు: ఐదేండ్ల వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథాశ్రమంలో చదువుకుంటున్న ఓ యువతి ఎంబీబీఎస్ సీటు సాధించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన వానరాసి సంధ్యను పోలీసులు, ప్రభుత్వ అధికారులు రామగుండంలోని తబితా అనాథాశ్రమంలో చేర్పించారు.
ప్రాథమిక విద్యాభ్యాసాన్ని రామగుండంలో పూర్తిచేసిన సంధ్య టెన్త్ వరకు నందిమేడారం సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివింది. అంతర్గాంలోని కస్తూర్బాలో బైపీసీ పూర్తి చేసి 955 మార్కులు సాధించింది. 12 ఏండ్లుగా ఆశ్రమంలోనే ఉంటూ నీట్పరీక్ష రాయగా.. గురువారం రాత్రి ప్రకటించిన ఫలితాల్లో 322 మార్కులతో ఎస్సీ క్యాటగిరిలో భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
సత్తా చాటిన తండా స్టూడెంట్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్లోక్య నాయక్ తండాకు చెందిన భూక్య అక్షర హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. నీట్లో 499 మార్కులతో జనరల్ కేటగిరీలో 1157వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 35వ ర్యాంకు దక్కించుకుంది.
