లక్నో: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని దయాల్బాగ్ లో రాధాస్వామి మత స్థాపకులు, మొదటి సంత్ సత్గురువు అయిన పరమ పురుష్ పూరన్ ధనీ హుజూర్ స్వామీజీ మహారాజ్ జయంతి సందర్భంగా పవిత్ర భండారా ఉత్సవం ప్రారంభమైంది. శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా పవిత్ర భండారా వేడుకను ఘనంగా స్టార్ట్ చేశారు. దీనికి ఇప్పటికే దేశవిదేశాల నుంచి వేలాది మంది సత్సంగీ సోదర సోదరీమణులు, జిజ్ఞాసులు దయాల్బాగ్కు చేరుకున్నారు.
ఈ నెల 2 నుంచి ప్రారంభమైన భండారా వారం.. 6వరకు కొనసాగుతుంది. ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి పలు రాష్ట్రాల నుంచి, యూరప్ దేశాల నుంచి భక్తులు ఈ పవిత్ర వేడుకలో పాల్గొననున్నారు. ప్రస్తుతం దయాల్బాగ్ ఎనిమిదవ వక్త్ సంత్ సత్గురువుగా హుజూర్ ప్రొఫెసర్ ప్రేమ్ సరన్ సత్సంగీ సాహబ్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పవిత్ర ఆరతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
