- రిబకిన, గాఫ్, స్వైటెక్, ఫ్రిట్జ్ కూడా..
- అగుర్, డి మినుయెర్, ముసెట్టీకి షాక్
న్యూయార్క్: జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్.. యూఎస్ ఓపెన్‌లో మరోసారి తీవ్రంగా శ్రమించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ జ్వెరెవ్ 6–4, 4–6, 7–6 (7/3), 6–7 (3/7), 6–3తో అన్‌సీడెడ్ క్వెంటిన్ హాలిస్ (ఫ్రాన్స్)పై కష్టపడి నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 4 గంటలా 33 నిమిషాల మ్యాచ్‌లో మూడో సెట్‌లో హాలిస్ 4–1 ఆధిక్యంలో నిలిచి జ్వెరెవ్‌కు వణుకు పుట్టించాడు. కానీ బలమైన సర్వీస్‌లు, బేస్ లైన్ గేమ్‌తో వరుసగా పాయింట్లు నెగ్గి సెట్‌ను కైవసం చేసుకుని గేమ్‌లో నిలిచాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అన్‌సీడెడ్ ప్లేయర్లతో జ్వెరెవ్ ఐదు సెట్ల పాటు పోరాడటం గమనార్హం. మ్యాచ్ మొత్తంలో 29 ఏస్‌లు సంధించిన జర్మన్ ప్లేయర్ క్లిష్ట సమయాల్లో శక్తివంతమైన సర్వీస్‌లతో ప్రత్యర్థిని అడ్డుకున్నాడు. 8 డబుల్ ఫాల్ట్స్ చేసిన అతను తన సర్వీస్‌లో 66 శాతం పాయింట్లు రాబట్టాడు. 20 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని మాత్రమే కాపాడుకున్నాడు. 60 విన్నర్లు, 40 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మొత్తం 183 పాయింట్లు సాధించాడు. 18 ఏస్‌లు, 12 డబుల్ ఫాల్ట్స్ చేసిన హాలిస్ నెట్ వద్ద మెరుగ్గా ఆడాడు. 54 విన్నర్లు సాధించిన అతను 63 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
ఏడు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాచుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–0, 6–1, 6–1తో మటియా బెలుసి (ఇటలీ)పై, కోబలి (ఫ్రాన్స్) 3–6, 6–3, 6–4, 7–5తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలవగా, ఫెలిప్ అగుర్ (కెనడా) 7–6 (7/5), 3–6, 2–6, 2–6తో కచనోవ్ (రష్యా) చేతిలో, మోన్‌ఫీల్స్ (ఫ్రాన్స్) 3–6, 4–6, 3–6తో తియెన్ (అమెరికా) చేతిలో, డి మినుయెర్ (ఆస్ట్రేలియా) 4–6, 5–7, 2–6తో వాన్ డి జాండ్‌స్కల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో, ముసెట్టీ (ఫ్రాన్స్) 6–3, 1–6, 2–6, 2–6తో స్వీని (ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నారు.
రిబకిన జోరు..
విమెన్స్ సింగిల్స్‌లో రెండోసీడ్ రిబకిన (కజకిస్తాన్) 6–2, 6–4తో బౌజర్ మనెరియో (స్పెయిన్)పై, స్వైటెక్ (పోలెండ్) 6–3, 6–2తో పోడ్రోస్కా (అర్జెంటీనా)పై, అన్సిమోవా (అమెరికా) 6–3, 3–6, 6–1తో లిల్లి టాగెర్ (ఆస్ట్రియా)పై, ఆండ్రీవా (రష్యా) 6–0, 6–2తో లైస్ (జర్మనీ)పై, జోవిచ్ (అమెరికా) 6–4, 6–4తో జోన్స్ (ఆస్ట్రేలియా)పై, నవోమి ఒసాక (జపాన్) 6–2, 5–7, 6–1తో సినియకోవా (చెక్)పై, కోకో గాఫ్ (అమెరికా) 6–4, 7–6 (7/5)తో బడోసా (స్పెయిన్)పై, అలెగ్జాండర్ ఈలా (ఫిలిప్పీన్స్) 6–1, 6–4తో ఒలెగ్జాండ్రా ఒలినికోవా (ఉక్రెయిన్)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 5–7, 6–4, 7–6 (10/5)తో బోండర్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
