ఏఐ రంగంలో నమ్మకమే కీలకం.. హైసియా ప్రెసిడెంట్ బిపిన్పెండ్యాల

ఏఐ రంగంలో నమ్మకమే కీలకం.. హైసియా ప్రెసిడెంట్ బిపిన్పెండ్యాల

హైదరాబాద్, వెలుగు: ఏఐ రంగంలో టెక్నాలజీ కంటే వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం అత్యంత కీలకమని హైసియా ప్రెసిడెంట్​, ఫ్లైట్ లెఫ్టినెంట్ బిపిన్ పెండ్యాల పేర్కొన్నారు.  కొలాబెర్రీ సీఈఓ రామ్ కాటమరాజు రచించిన  ‘ట్రస్ట్ బిఫోర్ ఇంటెలిజెన్స్’ పుస్తకాన్ని  హైదరాబాద్ టీ--–హబ్​లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో ఫైనాన్స్, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ వంటి రంగాలలో ఏఐ ఏజెంట్ల పాత్ర పెరుగుతుందని, అవి సురక్షితమనే భావనను ప్రజల్లో కలిగించాలని సూచించారు. 

రచయిత రామ్  మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం ఏఐ ప్రయోగాలు విశ్వసనీయత లేకే విఫలమవుతున్నాయని తెలిపారు. ఏఐ ఏజెంట్లకు నిర్ణయాధికారం ఇచ్చే ముందు వాటిపై సంస్థాగత జవాబుదారితనం ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టెక్​ నిపుణులు ఏఐ ఏజెంట్ల వల్ల ఎదురయ్యే సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు.