- నిందితుల అరెస్ట్
గండిపేట, వెలుగు: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలీనగర్‌కు చెందిన అబ్దుల్ రవూఫ్ ఆటో డ్రైవర్. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జావేద్ అలియాస్ హెక్లా జావేద్ తమ్ముడు సాజిద్ కర్ణాటకలో రెండేండ్ల కింద చనిపోయాడు. దీనికి రవూఫ్ కారణమని భావించిన జావేద్ కక్ష పెంచుకున్నాడు. రవూఫ్తనను కూడా బెదిరిస్తుండడం, ఎగతాళి చేస్తుండడంతో చంపాలని ప్లాన్వేశాడు.
మహ్మద్ అబ్దుల్లా, షేక్ ఆరిఫ్ తో కలిసి రవూఫ్ ఆటోలో వస్తుండగా అడ్డగించి పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో పొడిచి చంపేశారు. ఆయుధాలను, రక్తపు మరకల బట్టలను, పెప్పర్ స్ప్రే బాటిళ్లను పల్లెచెరువు సమీపంలోని పొదల్లో పడేశారు. ఈ నెల 4న కర్ణాటక వైపు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆరాంఘర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. మహ్మద్ జావేద్‌పై హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల్లో 180 కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
