మోడీనే గడగడలాడించిన మీకు ఈ చిట్టినాయుడు ఓ లెక్కనే కాదు: కేటీఆర్

మోడీనే గడగడలాడించిన  మీకు ఈ చిట్టినాయుడు ఓ లెక్కనే కాదు: కేటీఆర్

కరీంనగర్  సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సీఎం రేవంత్ రెడ్డి,  ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  యువతతో పెట్టుకుంటే వారి భవిష్యత్తు తారుమారవుతుందని, లక్కీ లాటరీతో సీఎం అయిన రేవంత్ రెడ్డికి యువత సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.మోడీని గడగడలాడించిన యువతకు ఈ కేడిగాడు ..ఈ చిట్టి నాయుడు మీకు లెక్కనే కాదన్నారు కేటీఆర్. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసి, ఎందరో యువకుల ఆత్మబలిదానాలకు కారణమైందని కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ లేవు.. జవాబులు లేవు అన్నట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతోందని, నోటిఫికేషన్లు పోయి లూటిఫికేషన్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోచేతికి బెల్లం పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రాహుల్ గాంధీ పత్తా లేకుండా పోయారని విమర్శించారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పాలిటెక్నిక్ భూములు కొట్టేసేందుకే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హామీల గురించి అడిగితే బెదిరిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక రౌడీషీటరా అని నిలదీశారు. అతి చేస్తున్న పోలీసులతో సహా ఎవరిని వదిలిపెట్టమని, రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రిటైర్డ్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.