టీచర్ చెప్పందే నువ్వు డాక్టర్ అయ్యావా?.. టీచర్లకు ఎమ్మెల్యే కవ్వంపల్లి క్షమాపణ చెప్పాలి

టీచర్ చెప్పందే నువ్వు డాక్టర్ అయ్యావా?..  టీచర్లకు ఎమ్మెల్యే కవ్వంపల్లి క్షమాపణ చెప్పాలి
  •    ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి ఫైర్

తిమ్మాపూర్, వెలుగు: ‘టీచర్లు చదువు చెప్పందే నువ్వు డాక్టర్​ అయ్యావా? నీకు అధికారంతో అహంకారం పెరిగింది. వెంటనే టీచర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది’. అని మానకొండూర్​ మాజీ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్​ హెచ్చరించారు. 

తిమ్మాపూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువులను ఒక బోడి టీచర్  అని మాట్లాడిన అజ్ఞాని, ఒక మూర్ఖుడు, అవివేకుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి అని దుయ్యబట్టారు. ‘సంస్కారహీనుడు కవ్వంపల్లి, అందుకే అతని రీతిలోనే మాట్లాడుతున్నా. నై తెలంగాణ అన్న చంద్రబాబు చెప్పులు మోసిన కుక్కవి నువ్వు. గోసి గొంగడితోనే తెలంగాణ సాధించినం. దాని విలువ నీకేం తెలుసు. 33 నెలల అధికారంతో ఎక్కడా లేని అహంకారం వచ్చింది. 

ఓటు కోసం పచ్చునూర్ లో పేరు రాసుకున్న చరిత్ర నీది. రేషన్ కార్డుకు రూ.500, ఖనీలు పాతితే రూ.1000 ఇలా అడుక్కు తినేది నువ్వు. వెయ్యి రోజుల పాలనల నిన్ను తిట్టుడే తప్ప నువ్వు ఏం చేసింది లేదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. టీచర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.