లీకు వీరుడి కోసం లై డిటెక్టర్ టెస్టు..ట్రంప్ ఆదేశాలతో అమలు చేస్తున్న అమెరికా రక్షణ శాఖ

లీకు వీరుడి కోసం లై డిటెక్టర్ టెస్టు..ట్రంప్ ఆదేశాలతో అమలు చేస్తున్న అమెరికా రక్షణ శాఖ

వాషింగ్టన్: అమెరికాలో ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడంపై ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ శాఖకు చెందిన సున్నితమైన సమాచారాన్ని మీడియాకు ఎవరు లీక్ చేశారో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం జాయింట్ స్టాఫ్‌‌‌‌‌‌కు చెందిన సుమారు 50 మంది అధికారులకు ‘పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్)’ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ టెస్టు తర్వాత కూడా లీకు వీరుడిని గుర్తించలేకపోయినట్లు సీబీఎస్ న్యూస్ వర్గాలు వెల్లడించాయి.