దుర్గామాత నిమజ్జనంతో హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

దుర్గామాత నిమజ్జనంతో హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

దసరా నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజులు దుర్గామాత విగ్రహాలతో పూజలు చేసిన భక్తులు.. ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో నవరాత్రులను పురస్కరించుకుని దుర్గామాత మంటపాలు ఏర్పాటు చేశారు. నవ రాత్రులు పూజలు అందుకున్న దుర్గమ్మలు.. 2026, అక్టోబర్ 21వ తేదీ  నుంచి నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. 

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు :

దుర్గా మాత నిమజ్జనాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ మళ్లింపులు, డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ప్రకటించారు పోలీసులు. హైదరాబాద్‌ సిటీలోని నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జల విహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు పోలీసులు.

ALSO READ : కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన కారు..

నిమజ్జన సమయంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు పోలీసులు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు ఆపటం, వేగంగా వెళ్లటం, నో పార్కింగ్ ప్లేసుల్లో వాహనాలు నిలపటం నిషేధం అని వివరించారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని వివరించారు పోలీసులు.