గోదావరిఖనిలో పెళ్లి జంటలను ఆశీర్వదించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

గోదావరిఖనిలో పెళ్లి జంటలను ఆశీర్వదించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గంగానగర్​లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి నివాసానికి వెళ్లి ఆయన కొడుకు రాహుల్ యాదవ్–దివ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మార్కండేయ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన వివాహానికి హాజరై చెన్నూరు నియోజకవర్గం సోమన్​పల్లికి చెందిన తుమ్మల సజన్ రెడ్డి–సహజ వధూవరులను ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.