ఓయూ, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో దేశంలో ఉన్నత విద్య– ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీస్నాన్టీచింగ్ఎంప్లాయిస్అసోసియేషన్రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ఖాన్, జనరల్ సెక్రటరీ వెంకటేశ్తెలిపారు.
శనివారం వర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓయూ కేంద్రంగా మూడు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు, వీసీలు, లెక్చరర్లు, విద్యావేత్తలు హాజరు కానున్నారని పేర్కొన్నారు.
