అడ్డాకుల/యాదగిరిగుట్ట, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి నుంచి భూత్పూర్ వరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన వెయ్యి రోజుల వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భూత్పూర్ లో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. వెయ్యి రోజుల్లో ప్రభుత్వ చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు.
యాదగిరిగుట్టలో పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఇంజ నరేశ్మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గతంలో అధికారంలో ఉండి ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ధర్నాల పేరుతో ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
