హైదరాబాద్, వెలుగు: క్వాడ్రిక్ ఐటీ సంస్థ హైదరాబాద్ కొండాపూర్ ఏషియన్ సన్‌సిటీలో డెలివరీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను శనివారం ప్రారంభించింది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
సంస్థ వ్యవస్థాపకులు కేసరి సాయి కృష్ణ, రఘు రామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు వినూత్న పరిష్కారాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తమ సంస్థ ఏఐ, ఆటోమేషన్, ఈఆర్‌పీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగాలలో సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
