జాగ్వార్ ల్యాండ్ రోవర్లో 4 వేల ఉద్యోగాల కోత

జాగ్వార్ ల్యాండ్ రోవర్లో 4 వేల ఉద్యోగాల కోత

యూకేలో వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన కంపెనీ 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ సబ్సిడరీ  జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రాబోయే రెండేళ్లలో యూకేలో సుమారు 4 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.  దాదాపు రూ.21,700 కోట్లు మేర ఖర్చులను  ఆదా చేయాలని ఈ నిర్ణయం  తీసుకుంది.

ఇందుకోసం  స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉద్యోగులకు, యూనియన్లకు సంస్థ తెలిపింది.  అమ్మకాలు తగ్గడం, పెరుగుతున్న ఖర్చులు, యూఎస్ విధించిన 10శాతం సుంకాలు కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.  

ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్ ఇప్పటికే 50 వేల మందిని తీసేయగా, మరో  50 వేల మందిని తొలగిస్తామని ప్రకటించింది.  మొత్తం యూరప్ ఆటో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది.