ఎంవీఎస్ కాలేజీని నంబర్ వన్గా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఎంవీఎస్ కాలేజీని నంబర్ వన్గా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాలేజీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ కళాశాలను రూ.70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌‌‌‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని, అందులో భాగంగా తొలి విడతగా రూ.20.50 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశామని, మిగిలిన రూ.50 కోట్లను కూడా దశలవారీగా సమకూర్చి తెలంగాణలోనే దీనిని నంబర్‌‌‌‌వన్‌‌‌‌గా మారుస్తామని తెలిపారు.

గర్ల్స్ హాస్టల్ నిర్మాణం, గ్రౌండ్ అభివృద్ధి తోపాటు, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో రూ.15 కోట్లతో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో సదుపాయాలు కల్పించి, మొత్తం ప్రాంగణాన్ని ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆయన నగరంలో వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆయన వెంట నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్,  డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,  మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నాయకులు తదితరులు 
పాల్గొన్నారు.