ఆమనగల్లు, వెలుగు : అర్హులైన ప్రతి నిరుపేదకూ సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఆయన పర్యటించారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు రూ. 40 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. హనుమాన్ ఆలయ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ అర్హులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమాలలో మార్కెట్ చైర్పర్సన్ గీత, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, ప్రజా ప్రతినిధులు, తహసీల్దార్ జయ శ్రీ, ఎంపీడీవో సుజాత, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, నాయకులు
పాల్గొన్నారు.
