డిసెంబర్‌‌‌‌లో విశ్వక్ సేన్ లెగసీ

డిసెంబర్‌‌‌‌లో  విశ్వక్ సేన్  లెగసీ

విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్‌‌.  ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్‌‌ దైదా దర్శకుడు. షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  శనివారం మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.

డిసెంబర్‌‌‌‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.  తండ్రి వారసత్వంతో ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువకుడికి ఎదురైన పరిణామాలే ఈ చిత్ర ప్రధాన కథాంశం.  బాలీవుడ్‌‌ యాక్టర్‌‌‌‌ కేకే మీనన్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు.  సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.