వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఇందులోని ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. అలాగే అక్టోబర్ 2న సినిమా విడుదల అని ప్రకటించారు.
అయితే గత కొంత కాలంగా ఈ సినిమా వాయిదా పడనుందనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. దీనిపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 2నే సినిమా విడుదల కానుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే ప్రమోషన్స్ విషయంలోనూ భారీ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఈ నెల రోజుల పాటు ప్రతి వారం ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించనున్నట్టు ప్రకటించారు.
ఇందులో భాగంగా వచ్చే వారం ప్రారంభంలో టీజర్, రెండో వారంలో ఫస్ట్ సాంగ్, చివరి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
