విద్యావ్యవస్థపై కొత్త చిత్రం.. జయంత్ అండ్ ది జింగో పెన్

విద్యావ్యవస్థపై కొత్త చిత్రం.. జయంత్ అండ్ ది జింగో పెన్

‘లతా భగవాన్‌‌ ఖరే’ చిత్రంతో జాతీయ స్థాయిలో మెప్పించిన నేషనల్ అవార్డ్‌‌ విన్నింగ్ డైరెక్టర్ నవీన్‌‌ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్‌‌ అండ్‌‌ ది జింగో పెన్‌‌’.  జయంత్‌‌ లీడ్ రోల్‌‌లో నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్‌‌ స్కూల్‌‌ టీచర్‌‌గా నటించారు.  దివ్య ప్రవీణ్‌‌ బొలిశెట్టి నిర్మించారు. టీచర్స్‌‌ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. 

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కార గ్రహీత మారం పవిత్ర ఫస్ట్‌‌లుక్‌‌ను విడుదల చేశారు.  అనంతరం దర్శకుడు నవీన్‌‌ దేశబోయిన మాట్లాడుతూ ‘చిన్నారులు స్కూల్‌‌లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించిన చిత్రం ఇది. 

 ‘ఫిలిప్‌‌ అండ్‌‌ ది మంకీ పెన్‌‌’ అనే మలయాళ చిత్రానికి రీమేక్.  ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో కూడిన ఈ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది.   తెలుగులోనూ మెప్పిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.  జయంత్, సత్యం రాజేష్‌‌, నిర్మాత దివ్య పాల్గొన్నారు.