పద్మారావు నగర్, వెలుగు: గాంధీ దవాఖానలో అత్యవసర విభాగానికి వచ్చిన ఓ రోగి సహాయకుడిపై దురుసుగా ప్రవర్తించిన కాంట్రాక్ట్ ఉద్యోగిని డీఎంఈ ఆదేశాల మేరకు హాస్పిటల్ఇన్చార్జి సూపరింటెండెంట్ప్రొఫెసర్వాణి విధుల నుంచి తొలగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని ఓ యువకుడు శనివారం ఉదయం గాంధీ దవాఖానకు తీసుకొచ్చాడు. 4 గంటలుగా వైద్యం అందకపోవడంతో అతను నిలదీయగా.. అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి వాగ్వాదానికి దిగి బయటకు వెళ్లాలని బెదిరించాడు.
ఈ తతంగాన్ని బాధిత యువకుడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఘటనపై స్పందించిన ఇన్చార్జి సూపరింటెండెంట్ సదరు ఉద్యోగిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
