ఏకాదశి.. హిందూ క్యాలెండర్‌లో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున విష్ణువు భక్తులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ ఏడాది( 2026)సెప్టెంబర్ 7 వ తేదీన అజ ఏకాదశి వచ్చింది. ఆ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సుఖశాంతులు, ఐశ్వర్యంతో ధనలాభం కలిగి పాపాలు పూర్తిగా పోతాయని పండితులు చెబుతున్నారు.
సనాతన ధర్మంలో శ్రీమహావిష్ణువు పూజకు ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది.శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే “అజ ఏకాదశి” అని పిలుస్తారు.ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండటం, ఆ హరి నామాన్ని స్మరించుకోవడం ద్వారా మోక్షం కలుగుతుందపి పండితులు చెబుతున్నారు.
అజ ఏకాదశి ముహూర్తం
పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2026) అజ ఏకాదశి ఉపవాసం సెప్టెంబర్ 7న, సోమవారం పాటించాలి. ఏకాదశి తిథి సెప్టెంబర్ 6 సాయంత్రం 7:29 గంటలకు ప్రారంభమై... సెప్టెంబర్ 7 సాయంత్రం 5:03 గంటలకు ముగుస్తుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అజ ఏకాదశి ఉపవాసాన్ని సెప్టెంబర్ 7న పాటిస్తారు.ఉపవాసాన్ని సెప్టెంబర్ 8 ఉదయం 6:21 గంటల నుంచి 8:50 గంటల మధ్య విరమించాలని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. సంపాదన ఉన్నప్పటికీ నిలకడ లేకపోవడం, అప్పుల బాధలు చుట్టుముట్టడం వంటి ఇబ్బందులు వేధిస్తుంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియడానికి అజ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేయాలని ధర్మ శాస్త్రాలు సూచిస్తున్నాయి.
పేదలకు అన్నదానం: ఏకాదశి రోజున నిరుపేదలకు అన్నదానం చేయడం వలన అనంతపుణ్యఫలం దక్కుతుంది. ఇలా చేయడం వలన ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
శ్రీమద్భాగవత పఠనం: అజ ఏకాదశి ( సెప్టెంబర్ 7) శ్రీమద్భాగవత కథను చదవినా.. విన్నా.. అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. దీని వలన మరణానంతరం మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతే భాగవతం చదడవడం వలన అక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది. అందుకే భాగవతం చదవడం పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని నింపుతుంది.
పంచామృత అభిషేకం: అజ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. స్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ఎంతో కాలంగా వేధిస్తున్న రుణ బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
బ్రహ్మ ముహూర్తంలో పూజ: ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు అజ ఏకాదశి ( 2026 సెప్టెంబర్ 7) తెల్లవారుజామున లేచి విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజించాలి. ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఉపవాస దీక్షను పాటించాలి. ఇలా చేయడం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మంత్ర జపం: అజ ఏకాదశి రోజు విష్ణు మంత్రాలను నిష్ఠగా జపించాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో.. వ్యాపారంలో వచ్చే ఆటంకాలకు పరిష్కారం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఆలోచనలు రావడం.. వ్యాపార అభివృద్ది జరగడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
దంపతుల కలహాలకు పరిహారం: ప్రతి ఇంట్లో దంపతుల మధ్య గొడవలు కామన్. ఇలాంటి తరచూ వస్తే జీవితంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు వస్తుంటే అజ ఏకాదశి రోజున తులసి మాతను పూజించాలి. ఇంకా లక్ష్మీదేవికి గంధం.. పసుపు.. కుంకుమ.. గాజులు.. ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. ఇలా చేయడం వలన దాంపత్య జీవితంలో వచ్చే ఇబ్బందులు తొలగుతాయి.
రావి చెట్టు పూజ: అజ ఏకాదశి రోజు రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి అనుగ్రహం లభించి.. ఇంట్లోని దారిద్య్రాన్ని తొలగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
