కోహ్లీ జాతకంలో రాజయోగం.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?: విరాట్ ఫ్యూచర్‌పై ఆసక్తికర విషయాలు!

కోహ్లీ జాతకంలో రాజయోగం.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?: విరాట్ ఫ్యూచర్‌పై ఆసక్తికర విషయాలు!

Virat Kohli Horoscope: ప్రపంచ క్రికెట్‌లో మిగతా బ్యాటర్లంతా ఒకవైపు ఉంటే, భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎలాంటి ప్రభావాన్ని చూపించాడో, ఇప్పుడు కోహ్లీ క్రీజులోకి వస్తే ప్రత్యర్థి కెప్టెన్లకు అదే స్థాయి భయం పట్టుకుంటోంది. ప్రస్తుతం టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే దృష్టి సారించిన విరాట్, 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ క్రికెట్ కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, జ్యోతిష పండితుల ప్రకారం విరాట్ కోహ్లీ జాతక చక్రం అతని భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది.

రాహు మహాదశ తెచ్చిన మహర్దశ: 

విరాట్ కోహ్లీ జాతకం ప్రకారం కన్యా రాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ధనూ లగ్నంలో జన్మించాడు. లగ్నంలో శని ఉండటంతో అతనికి క్రమశిక్షణ, కఠిన శ్రమ, పట్టుదలకి, రాహువు ప్రభావంతో ధైర్యసాహసాలు,  క్రీడారంగంలో మంచి గుర్తింపు లభించాయి. 2011 నుంచి 2029 వరకు కోహ్లీ జాతకంలో నడుస్తున్న రాహు మహాదశ కారణంగానే అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న శుభ గ్రహాల అంతర్దశలతో రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆటగాడిగా కొనసాగేందుకు విరాట్ కోహ్లీకి ఎలాంటి అడ్డంకులు లేవు. శని ప్రభావంతో వచ్చే చిన్నపాటి ఫిట్‌నెస్ సమస్యలను తన క్రమశిక్షణతో అధిగమిస్తాడని జ్యోతిష్య విశ్లేషణ తెలుపుతోంది.

2028–29లో మొదలకానున్న గురు మహాదశ: 

2028–29 నాటికి కోహ్లీ జాతకంలో రాహు మహాదశ ముగిసి లగ్నాధిపతి అయిన గురు మహాదశ స్టార్ట్ కాబోతుంది. ఈ సమయం అతని జీవితంలో మరొక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మైదానంలో ఆటగాడిగా వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కోహ్లీ భారత జట్టుకు మెంటార్‌గా లేదా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ అకాడమీలు స్థాపించడం, నూతన క్రీడాకారులకు మార్గదర్శకత్వం చేయడం ద్వారా క్రికెట్ రంగానికి తన సేవలను కొనసాగిస్తాడని జాతక చక్రంలో కనిపిస్తోంది. 

►ALSO READ | బీసీసీఐ బిగ్ ప్లాన్: 2027–31 షెడ్యూల్ మార్పు.. ముక్కోణపు సిరీస్‌లు మళ్లీ స్టార్ట్?

వ్యాపార సామ్రాజ్యం విస్తరణ.. వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికం వైపు:

జాతకంలో గ్రహాల పొజిషన్ అద్భుతంగా ఉండటంతో విరాట్ కోహ్లీకి ఆర్థికంగా ఎలాంటి సమస్య లేకపోవడంతో పాటు వ్యాపారాల్లో భారీ లాభాలు అందుతాయి. తన సొంత బ్రాండింగ్, కొత్త వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే వయస్సు పెరిగే కొద్దీ దైవచింతన, ధ్యానం, సామాజిక సేవా కార్యక్రమాల వైపు కింగ్ కోహ్లీ మనసు ఎక్కువగా మళ్లుతుందని గ్రహాల మూమెంట్ ని బట్టి తెలుస్తుంది. క్రికెటర్‌గానే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తగా, సమాజానికి మార్గదర్శకుడిగా విరాట్ సుదీర్ఘకాలం తన ప్రభావాన్ని చూపిస్తాడు.