ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..

 ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..

తన వయసు యువకులు రీల్స్ చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లలో మునిగి పోయిన సమయంలో.. ఒక్కడే నదిని శుభ్రం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు బిట్టు తబాహీ అను యువకుడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నపాటి ఇన్ ఫ్లూయెన్సర్ అయ్యాడు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఎవరంటే బిట్టు. మనం తలుచుకుంటే పరిసరాల్లో ఎంత మార్పు తీసుకురావచ్చో చేసి చూపించిన ఈ కుర్రోడికి భారీ ఆఫర్ వచ్చింది. అదేంటో చూద్దాం.

మధ్యప్రదేశ్‌లోకు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి అనే దేశంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆన్‌లైన్‌లో బిట్టు తబాహీగా ప్రసిద్ధి చెందిన ఈ యువ సంచలనం.. నెలల తరబడి కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేశాడు. అతని ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ది ఓషన్ క్లీనప్ వ్యవస్థాపకుడు, డచ్ సీఈఓ బోయన్ స్లాట్ అతన్ని తన సంస్థలో పని చేయమని ఆహ్వానించడం హాట్ టాపిక్.

 ప్రభుత్వ అధికారిక ప్రచార కార్యక్రమం కాదు  లేదా పెద్ద ఎన్విరాన్‌మెంటల్ డ్రైవ్‌లో భాగం కూడా కాదు. బిట్టు సొంత ఖర్చులు భరించి అజ్నార్ నది నుంచి ప్లాస్టిక్, వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించి క్లీన్ చేశాడు.  అతను ఇన్‌స్టాగ్రామ్‌లో నది ముందు-తర్వాత ఫోటోలను షేర్ చేశాడు. మొదటి చిత్రంలో నది, పరిసరాలు చెత్తతో నిండి ఉండగా, రెండో చిత్రంలో అతని కృషి ఫలితంగా పరిశుభ్రంగా కనిపించింది. ఒక్క వ్యక్తి నిరంతర కృషితో ఎంత మార్పు తీసుకురాగలడో ఈ ఫోటోలు స్పష్టం చేశాయి.

ఈ కథనం ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ అయినప్పుడు బోయన్ స్లాట్ స్పందించారు. మాతో కలిసి పని చేయండి అని  ఆహ్వానించారు. ది ఓషన్ క్లీనప్ సంస్థ సముద్రాలు, నదుల నుంచి ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడంపై పని చేస్తోంది. ఈ ఆహ్వానంతో స్థానిక స్థాయిలో ఒక యువకుడి వ్యక్తిగత ప్రయత్నం ప్రపంచ స్థాయి అవకాశంగా మారింది.

సురేంద్ర సింగ్ చౌదరి ఈ కృషి పర్యావరణ పరిరక్షణకు ఒక వ్యక్తి సహితం ఎలా మార్పు తీసుకురాగలడో నిరూపించింది.