భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. కేవలం 55 పరుగులకే ఆలౌట్

భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. కేవలం 55 పరుగులకే ఆలౌట్

మహిళల టీ20 ఆసియా కప్‎లో భాగంగా ఇండియాతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో పాకిస్తాన్ కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది. శ్రీచరణి, ప్రేమ్ రావత్ చెరో మూడు వికెట్లతో చెలరేగి పాక్ పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ 2, షెఫాలీ వర్మ ఒక వికెట్ తీశారు. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (13), షావాలీ జుల్ఫికర్ (14) ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. నలుగురు సింగిల్ డిజిట్‏కే పరిమితమవగా.. మరో నలుగురు డకౌట్ అయ్యారు. 

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టును నిండా ముంచింది. ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులో పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పరుగుల సంగతి పక్కనపెడితే వికెట్ కాపాడుకోవడానికి కూడా దాయాది ప్లేయర్లు నానా తంటాలు పడ్డారు. పవర్ ప్లే నుంచే వరుసగా వికెట్లు పడగొడుతూ పాకిస్థాన్ ఇన్నింగ్స్ను దెబ్బతీశారు. 

►ALSO READ | IND-W vs PAK-W: పాక్‎తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా

పాక్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలదొక్కుకుని భారత బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయారు. 13.5 ఓవర్లలో 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో పాక్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. చివరకు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలడంతో పాక్ కథ ముగిసింది. శ్రీచరణి, ప్రేమ్ రావత్ చెరో మూడు వికెట్లతో పాక్ బ్యాటర్లను వణించారు. దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది.