నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ జాతరకు వేళయైంది. బాక్సాఫీస్ వద్ది విజృంభించేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఊరమాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో 'NBK 111' ( వర్కింగ్ టైటిల్ ) మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ క్రమంలోనే అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ను వృద్ధి సినిమాస్ బ్యానర్ మైండ్ బ్లాకింగ్ పోస్టర్‌తో అనౌన్స్ చేసింది. ముఖమంతా రక్తపు మరకలతో కసిగా చూస్తున్న బాలయ్య లుక్ ను రిలీజ్ చేసింది. 'మ్యాడ్ నెస్‌కు రేపు సాయంత్రం 6:40 గంటలకు పేరు పెట్టబోతున్నాం' అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఫిల్మ్ నగర్ వర్గాలతో పాటు నెట్టింట ఈ మాస్ యాక్షన్ డ్రామా కోసం 'గాడ్', 'దాదా’ అనే రెండు శక్తివంతమైన టైటిల్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. వీటిలో బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లుగా ఏ టైటిల్‌ను లాక్ చేశారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. టైటిల్‌తో పాటు ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండబోయే గ్రాండ్ రిలీజ్ డేట్‌పై కూడా మేకర్స్ స్పష్టత ఇవ్వనున్నారు.
►ALSO READ | అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా 'ముగ్గురు కోతులు' క్రేజీ మెలోడీ లాంచ్
ఇక ఇటీవల షూటింగ్‌లో చిన్నపాటి గాయం కావడం, కాలికీ సర్జరీ జరగడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డా.. సింహం మళ్ళీ వేటకు సిద్ధమైంది. ప్రస్తుతం పూర్తి కోలుకున్న బాలయ్య, రెట్టింపు జోష్‌తో సెట్స్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు కొరటాల శివతో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ లైనప్ తో సిద్ధమయ్యారు. మరి ఈ రక్తం చిందించే విధ్వంసానికి ఎలాంటి టైటిల్ పడునుందో చూడాలి.
Tomorrow - 6:40PM 🔥#NBK111 pic.twitter.com/vLxAkmrxEB
— Gopichandh Malineni (@megopichand) September 5, 2026
