బాలాపూర్ గణేష్ లడ్డూనే కాదు.. విగ్రహం కూడా ఫేమస్సే..! ఈ సారి హైలైట్స్ ఇవే..!

బాలాపూర్ గణేష్ లడ్డూనే కాదు.. విగ్రహం కూడా ఫేమస్సే..! ఈ సారి హైలైట్స్ ఇవే..!

వినాయక చవితి వచ్చేస్తోంది. వాడవాడలా జనం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ లోని ఖైరతాబాద్, బాలాపూర్ వినాయక మండపాలు. ఖైరతాబాద్ భారీ గణేశుడికి ప్రసిద్ధి అయితే... బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలానికి ఫేమస్. ఈ సారి బాలాపూర్ గణేశుడు 18 అడుగుల ఎత్తుతో భక్తుల పూజలు అందుకునేందుకు సిద్దమయ్యాడు.

ఈసారి బాలాపూర్ గణేశుడి హైలైట్స్ ఇవే:

  • వినాయకుడి ప్రతిమ ధర RS. 3.20 లక్షలు. 
  • బాలాపూర్ వినాయక మండపం ఏడాది పూరి జగన్నాథ ఆలయనామానాలో ఏర్పాటు..మండపం ఖర్చు రూపాయలు 40 లక్షలు.
  • మండపాన్ని దిల్ సుఖ నగర్ కు చెందిన సుధాకర్ రెడ్డి అనే డెకరేటర్ వేస్తున్నాడు..
  • వినాయకుని దర్శించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వారి వాహనాలు పార్కింగ్ చేసేందుకు హనుమాన్ టెంపుల్ వెనకాల ఉన్న ఎనిమిది ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా సాయి హోమ్స్ కాలనీ పక్కన ఉన్న ఆరు ఎకరాలు కూడా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
  • దర్శనానికి వచ్చే భక్తుల కోసం గణేష్ చౌక్ దగ్గరే ఇన్, ఔట్ ఏర్పాటు చేస్తున్నారు. 
  • మండపం వరకు రెండు క్యూ లైన్ ల ద్వారా భక్తులను దర్శనానికి పంపిస్తారు. దర్శనం అనంతరం మరో ద్వారం గుండా గణేష్ చౌక్ నుంచి బయటకు పంపిస్తా. 
  • చిన్నపిల్లలకు దివ్యాంగులకు ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం.
  • బాలాపూర్ గ్రామస్తులకు మరో ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు.
  • ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వందమంది వాలంటీర్లు మండపం వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. 
  • ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసుల బందోబస్తు.
  • వంద సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రత పర్యవేక్షణ 
  • గత సంవత్సరం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ పాదరక్షల కోసం అటు ఇటు తిరగడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితి ఈ ఏడాది రాకుండా గణేష్ చౌక్ పక్కనే పాదరక్షలను భద్రపరుచుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు.