పలు రాష్ట్రాల AICC ఇంచార్జులు మార్పు.. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా పీవీ మోహన్

పలు రాష్ట్రాల AICC ఇంచార్జులు మార్పు.. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా పీవీ మోహన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాల ఏఐసీసీ ఇంచార్జులను మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్‎గా ఏపీ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఉండేవారు. మహారాష్ట్ర ఇంచార్జ్‎గా శ్రీవెల్లప్రసాద్‎కు బాధ్యతలు అప్పగించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‎కు పార్టీ ఇంచార్జ్‎గా సచిన్ పైలట్‎ను నియమించింది. దీంతో పంజాబ్ కాంగ్రెస్‎లో నెలకొన్న అంతర్గత విభేదాలకు ఏఐసీసీ పుల్‎స్టాప్ పెట్టింది. 

ఇక, ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‎కు ఏఐసీసీ ఇంచార్జ్‎గా సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా అదనపు బాధ్యతలు అప్పగించింది. అస్సాంకు మాజీ సీఎం భూపేష్ బఘేల్, ఛత్తీస్‌గఢ్‎కు సుఖ్‌దేవ్ భగత్‌ను ఏఐసీసీ ఇంచార్జులుగా అపాయింట్ చేసింది. ఆకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జులను మార్చడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

►ALSO READ | దూసుకెళ్లిన జీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌వీ ఎఫ్17 .. తొలిసారి 36 వేల కి.మీ. ఆర్బిట్‌‌‌‌‌‌‌‌లోకి ఇస్రో ఇమేజింగ్ శాటిలైట్