ఉమెన్స్ ఆసియ కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఉమెన్స్ టీం అదరగొట్టింది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి పాకిస్థాన్ ఇండియా బౌలర్ల దాటికి కుప్పకూలింది.18.1 ఓవర్లు ఆడిన పాకిస్థాన్ కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప టార్గెట్ తో బరిలో దిగిన ఇండియా కాస్త తడబడినట్లు అనిపించినా...8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
ఇండియా బ్యాటర్లలో హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 18 రన్స్, దీప్తి శర్మ 14 బంతుల్లో 12 రన్స్ చేసి నాటౌట్ గా నిలవగా.. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందన ఆకట్టుకోలేకపోయారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. దీప్తీ శర్మ 2, షెఫాలీ వర్మ ఒక వికెట్ తీశారు.
►ALSO READ | భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. కేవలం 55 పరుగులకే ఆలౌట్
పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (13), షావాలీ జుల్ఫికర్ (14) ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమవగా.. మరో నలుగురు డకౌట్ అయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని పాక్ కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టును నిండా ముంచింది. ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులో పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. పరుగుల సంగతి పక్కనపెడితే వికెట్ కాపాడుకోవడానికి కూడా దాయాది ప్లేయర్లు నానా తంటాలు పడ్డారు. పవర్ ప్లే నుంచే వరుసగా వికెట్లు పడగొడుతూ పాకిస్థాన్ ఇన్నింగ్స్ ను దెబ్బతీశారు.
