మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ హైఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ఏలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 5) రాత్రి దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో హార్మన్ సేన మొదట బౌలింగ్ చేయనుంది.
ఇప్పటికే లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచులు గెలిచి సెమీస్‌కు చేరుకున్న టీమిండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసి లీగ్ దశను అజేయంగా ముగించాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా థాయిలాండ్ను ఓడించినప్పటికీ, నెట్ రన్ రేట్ సమీకరణాల దృష్ట్యా సెమీస్ ఆశలను పదిలం చేసుకోవడానికి భారత్‌పై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?:
శనివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ బ్లాక్బస్టర్ మ్యాచ్ను క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్కు చెందిన సోనీ స్పోర్ట్స్ టెన్ 1 తో పాటు ప్రాంతీయ భాషల్లో సోనీ స్పోర్ట్స్ టెన్ 3, టెన్ 4 ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ రానుంది. డిజిటల్ యూజర్లు సోనీ లివ్ (SonyLIV) యాప్, వెబ్సైట్లో ఈ మహా సంగ్రామాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. నాకౌట్ మ్యాచ్లకు ముందు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్, ఓటముల పరంపరకు అడ్డుకట్ట వేయాలని పాకిస్తాన్ చూస్తుండటంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇండియా ప్లేయింగ్ లెవన్:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందినీ శర్మ
పాకిస్తాన్ ప్లేయింగ్ లెవన్:
మునీబా అలీ, షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా (సి), ఎమాన్ ఫాతిమా, ఉమ్-ఎ-హని, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్
