ఢిల్లీలో విషాద ఘటన.. కుప్పకూలిన స్టూడెంట్స్ పీజీ బిల్డింగ్.. శిథిలాల కింద 50 మంది..

ఢిల్లీలో విషాద ఘటన.. కుప్పకూలిన స్టూడెంట్స్ పీజీ బిల్డింగ్.. శిథిలాల కింద 50 మంది..

ఢిల్లీ: ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద కనీసం 50 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు పేయింగ్ గెస్ట్ వసతిగా పనిచేస్తున్న భవనం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో చాలా మంది విద్యార్థులు ఈ బిల్డింగ్లోనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ బిల్డింగ్ దగ్గర భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక వ్యక్తి కాంక్రీట్ స్లాబ్ కింద ఇరుక్కుని ఉండగా, కొందరు దానిని పైకి లేపి అతనిని కాపాడేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యల కోసం కనీసం 12 అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. స్లాబులను తొలగించడానికి ఒక ఎక్స్‌కావేటర్‌ను ఘటనా స్థలానికి తీసుకువచ్చారు.

పీజీ వసతిగా ఉన్న ఈ బిల్డింగ్లో భవనం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని రక్షించినట్లు చెప్పారు. ఈ ప్రాంతం ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌కు దగ్గరలో ఉంది. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు.

►ALSO READ | ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..