రైల్ ఇండియా (రైట్స్)లో జాబ్స్ .. మెట్రో ప్రాజెక్ట్ లలో జీఎం పోస్టులు భర్తీ.. వివరాలు ఇవే..!

రైల్ ఇండియా (రైట్స్)లో జాబ్స్ .. మెట్రో ప్రాజెక్ట్ లలో జీఎం పోస్టులు భర్తీ.. వివరాలు ఇవే..!

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) సంస్థలో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి వివిధ  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

విభాగాల వారీగా ఖాళీలు: జీఎం(టీమ్ లీడర్ / మెట్రో వర్క్స్) 1, జేజీఎం (జియోటెక్నికల్ ఎక్స్​పర్ట్ / మెట్రోవర్క్స్) 1, డీజీఎం (ఆర్కిటెక్ట్ / మెట్రో వర్క్స్) 1.

ఎలిజిబిలిటీ 

జీఎం(టీమ్ లీడర్ / మెట్రో వర్క్స్): సివిల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈ పూర్తిచేసి ఉండాలి.

జేజీఎం (జియోటెక్నికల్ ఎక్స్‌పర్ట్ / మెట్రోవర్క్స్): సివిల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు జియోటెక్నికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

డీజీఎం (ఆర్కిటెక్ట్ / మెట్రో వర్క్స్): ఆర్కిటెక్చర్‌లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ స్క్కూట్నీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rites.comను సందర్శించండి.