వెస్ట్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్ .. స్పోర్ట్స్ కోటాలో విభాగాల వారీగా ఖాళీలు ఇవే

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్ ..  స్పోర్ట్స్ కోటాలో విభాగాల వారీగా ఖాళీలు ఇవే

వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్  స్పోర్ట్స్ కోటా కింద 64 పోస్టుల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.



విభాగాల వారీగా ఖాళీలు

మొత్తం ఖాళీలు: 64 
లెవల్ 5/ 4:  5 ఖాళీలు
లెవల్ 3/2 :16  ఖాళీలు
లెవల్ 1 : 43 ఖాళీలు

ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5/4 అంతకంటే ఎక్కువ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

లెవల్ 3 / 2 పోస్టులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదో తరగతితోపాటు యాక్ట్ అప్రెంటిస్‌షిప్ / ఎన్​సీవీటీ లేదా ఎస్​సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

లెవల్ 1 పోస్టులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఐటీఐ లేదా సమాన అర్హత లేదా ఎన్​సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయసు: 2027, జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలు 
రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించాలి.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో కనబర్చిన ప్రతిభకు 50 మార్కులు, గేమ్ స్కిల్, శారీరక దారుఢ్యం & ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలనకు 40 మార్కులు, విద్యార్హతకు 1‌‌0 మార్కులు కేటాయించారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rrc-wr.comను సందర్శించండి. 

 

►ALSO READ | రైల్ ఇండియా (రైట్స్)లో జాబ్స్ .. మెట్రో ప్రాజెక్ట్ లలో జీఎం పోస్టులు భర్తీ.. వివరాలు ఇవే..!