కొత్తవారం దిగొచ్చిన బంగారం.. హైదరాబాదులో గ్రాము రేటు ఎంతుందంటే..?

కొత్తవారం దిగొచ్చిన బంగారం.. హైదరాబాదులో గ్రాము రేటు ఎంతుందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా వడ్డీ ఆదాయం రాని బంగారాన్ని వీడి బాండ్ మార్కెట్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తమ డబ్బును మళ్లిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించి ముందుకెళ్లటం బెటర్. 

సెప్టెంబర్ 7న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.65 తగ్గాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 415గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 130గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.