రెండంకెల వృద్ధి సాధిస్తాం.. రిటైల్నెట్వర్క్‎ను పెంచుతాం: ఎండీ అబ్దుల్

రెండంకెల వృద్ధి సాధిస్తాం.. రిటైల్నెట్వర్క్‎ను పెంచుతాం: ఎండీ అబ్దుల్

హైదరాబాద్, వెలుగు: జర్మన్ బాత్రూమ్ సొల్యూషన్స్ బ్రాండ్ హన్స్‌‌‌‌‌‌‌‌గ్రోహె ఇండియా రాబోయే రెండేళ్లలో తెలంగాణలో తమ రిటైల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను విస్తరించి, రెండంకెల వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 17 స్టోర్లు ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వీటి సంఖ్య 22కి పెంచుతామని సంస్థ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్​లో 50 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పరిశ్రమ వర్గాలతో ఎక్స్‌‌‌‌‌‌‌‌క్లూజివ్ డెవలపర్ డైలాగ్ నిర్వహించింది. 

దక్షిణ భారతదేశంలో అల్ట్రా లగ్జరీ ఇళ్లకు హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌గా ఎదుగుతోందని, 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లు పైబడిన ఇళ్ల లావాదేవీల విలువ రూ.8,562 కోట్లు ఉందని ఇండస్ట్రీ నివేదికలు చెబుతున్నాయి. ఆధునిక ఇళ్లకు సరిపోయే డిజైన్, టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు స్థానిక డెవలపర్లతో చర్చిస్తున్నట్లు సంస్థ ఎండీ అబ్దుల్ ఖాదర్ బెంగాలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో  కంపెనీ కొత్త ఉత్పత్తులను ప్రదర్శించారు.