హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విప్ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కేటీఆర్ తన హెయిర్ స్టైల్, డ్రెస్ స్టైల్ మార్చుకోవడానికి బదులుగా ముందుగా తన మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేటీఆర్ పరిస్థితి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది .
అంత మాత్రాన నక్క పులి కాదు, అట్లనే రేవంత్ రెడ్డిలా కేటీఆర్ సీఎం కాలేరు’’ అని అన్నారు. దుబాయ్ వేదికగా కేటీఆర్ తన సోషల్ మీడియా టీమ్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొండూరు సాకేత్ అనే వ్యక్తితో కోట్లాది రూపాయలు ఖర్చు చేయిస్తూ, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఆకృత్యాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు.
