- అల్ఫోర్స్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్కూల్
కరీంనగర్, వెలుగు: తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఆమోద ప్రక్రియ తుది దశకు చేరిందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి రెండో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు వెస్ట్ ఆస్ట్రేలియాలో చేపట్టిన పర్యటన విశేషాలను శనివారం మీడియాకు వెల్లడించారు.
భారతీయ విద్యా వ్యవస్థ అకడమిక్స్‌లో ముందున్నప్పటికీ, స్కిల్ఆధారిత విద్యకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 12 మంది ఎడ్యుకేషన్ లీడర్లతో కలిసి ఆస్ట్రేలియాలోని పలు యూనివర్సిటీలు, పాఠశాలలను సందర్శించి అక్కడి విద్యావిధానం, కరిక్యులం, ఉపాధి అవకాశాలను పరిశీలించినట్లు తెలిపారు. అక్కడ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యావిధానం అమలులో ఉందని, బోర్డు పరీక్షల ఒత్తిడి లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కు 50 శాతం మార్కులు కేటాయిస్తున్నారని వివరించారు. ఈ విధానం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిల్లలపై మార్కుల ఒత్తిడి పెంచకుండా ఐఐటీ, మెడిసిన్‌తో పాటు క్లాట్, సీఏ, వ్యవసాయం, క్రీడలు, సాంకేతిక, వృత్తి విద్యా రంగాల వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే, మైనర్ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.
