మ్యూల్ అకౌంట్ల పై పోలీసుల కొరడా..కరీంనగర్ కమిష నరేట్ వ్యాప్తంగా 29 కేసులు, 88 మందిపై చర్యలు

మ్యూల్ అకౌంట్ల పై పోలీసుల కొరడా..కరీంనగర్ కమిష నరేట్ వ్యాప్తంగా 29 కేసులు, 88 మందిపై చర్యలు

కరీంనగర్, వెలుగు: సైబర్ నేరాలకు వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల నిర్వాహకులపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝులిపించారు. కమీషన్ల ఆశ చూపి అమాయకుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటిని సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 29 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు కాగా, 122 మందిని నిందితులుగా గుర్తించి 88 మందిని అరెస్టు చేశారు.

పోలీస్ స్టేషన్ల వారీగా..

కరీంనగర్ వన్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 కేసులకు సంబంధించి 20 మందిని నిందితులుగా గుర్తించి 13 మందిని అరెస్టు చేశారు. టూ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 కేసుల్లో 26 మందికి 16 మందిని అరెస్టు చేశారు. జమ్మికుంట టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 కేసులు నమోదై 15 మందిని నిందితులుగా గుర్తించారు. కరీంనగర్ త్రీ టౌన్, హుజూరాబాద్ టౌన్, కొత్తపల్లి, మానకొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండేసి కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ రూరల్, చొప్పదండి, ఇల్లందకుంట, గంగాధర, ఎల్ఎండీ కాలనీ, సైదాపూర్, వీణవంక పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదైంది. కాగా, బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీలను ఇతరులకు ఇవ్వడం లేదా కమీషన్ల ఆశతో లావాదేవీలకు అనుమతించడం నేరమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే ఖాతాదారులపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.