హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ స్ట్రే వేకెన్సీ సీట్ల(మిగిలిపోయిన సీట్లు) కేటాయింపును కాళోజీ హెల్త్ వర్సిటీ(కేఎన్ఆర్యూహెచ్ఎస్) పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,660 ఎంబీబీఎస్ సీట్లు, 11 డెంటల్ కాలేజీల్లో 514 బీడీఎస్ సీట్లతో కలిపి మొత్తం 3,174 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తూ లిస్టును విడుదల చేసింది.
మెడికల్ విభాగంలో అత్యధికంగా ఘట్కేసర్లోని నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 190 సీట్లు భర్తీ కాగా, ఈ విడతలో అపోలో మెడికల్ కాలేజీలో 32,562వ ఆలిండియా ర్యాంకుతో ప్రారంభమై ఎన్ఆర్ఐ కోటాలో 11.9 లక్షల పైచిలుకు ర్యాంకు సాధించిన విద్యార్థుల వరకు సీట్లు లభించాయి. సీట్లు దక్కించుకున్న విద్యార్థులందరూ అక్టోబర్26 రాత్రి 8 గంటల్లోపు కాలేజీల్లో వ్యక్తిగతంగా హాజరై అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అభ్యర్థులు గడువులోగా సర్టిఫికేట్లు సమర్పించి ట్యూషన్ ఫీజు, వర్సిటీ రుసుములను చెల్లించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
