టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్ష వాయిదా వేయండి.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి  హరీశ్‌‌‌‌రావు లేఖ 

 టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్ష వాయిదా వేయండి.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి  హరీశ్‌‌‌‌రావు లేఖ 

హైదరాబాద్, వెలుగు: నవంబర్ 6న నిర్వహించనున్న టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌‌‌‌రావు డిమాండ్ చేశారు. ఒకే రోజు రెండు కీలక పోటీ పరీక్షలు ఉండటంతో వేలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ) నిర్వహించే జూనియర్ ఇంజనీర్ (జేఈ) పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు జరగనున్నాయని హరీశ్‌‌‌‌రావు గుర్తుచేశారు.

అదే నెల 6న టీజీపీఎస్సీ రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ) సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పరీక్షను నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిందన్నారు. ఒకే సిలబస్, సమాన విద్యార్హతలతో కూడిన ఈ పరీక్షలకు రాష్ట్రంలోని వేలాది మంది అభ్యర్థులు ఏళ్లుగా సిద్ధమవుతున్నారని తెలిపారు. తేదీల క్లాష్‌‌‌‌తో వారు ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అభ్యర్థుల ఇబ్బందులను గుర్తించి ఒడిశా, బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షల తేదీలను మార్చాయని పేర్కొన్నారు.