గోపీచంద్ తన కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 34వ చిత్రం ‘సింగ’. స్టంట్ మాస్టర్ వి. వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌తో ఆసక్తిని పెంచిన మేకర్స్.. శనివారం కొత్త పోస్టర్‌తో మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇందులో గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
మిస్టీరియస్ అడవిలోని ఓ రాతి గుట్టపై నిలబడి, డార్క్ బ్లూ డ్రెస్‌లో, రఫ్ లుక్‌తో ఉన్న పోస్టర్ ఆయన పాత్రలోని ఇంటెన్స్‌ను తెలియజేస్తుంది. తాజాగా కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. దీంతో సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్పెషల్ సెట్స్‌ను నిర్మించి, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
డిసెంబర్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్టు దీనికోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మలయాళ హీరోయిన్ అనార్కలి నాజర్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు గోపీచంద్ హీరోగా నటించిన ‘భరతవర్ష’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
