‘రణబాలి’ చిత్రం నటుడిగా తన జీవితానికి అర్థాన్నిచ్చిందని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఈ సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన రణభేరి వేడుకలో విజయ్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. రాయలసీమ తనకు ఎంతో ఇచ్చిందని, ఈ ప్రాంతంపై ఉన్న కృతజ్ఞతతోనే ‘రణబాలి’ సినిమా చేశానని అన్నాడు.
తాను చదువుకున్న ప్రాంతాల్లోనే సినిమా చిత్రీకరించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది అని చెప్పాడు. తాను పుట్టిన నేల రుణం ‘రణబాలి’ ద్వారా కొంత తీర్చుకున్నానని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చెప్పాడు. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తున్నాయని, రాయలసీమ నుంచి ఓవర్ ఫ్లోస్ వస్తున్నాయని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
