శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులను అలరించేలా ఓ రెట్రో మాస్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు శ్రీనువైట్ల అప్‌డేట్ అందించాడు.
‘ఈ బీట్స్ థియేటర్లను షేక్ చేయబోతున్నాయి.. రెట్రో మాస్ సాంగ్ సిద్ధమవుతోంది. మాస్ లవర్స్‌కు ఇది అదిరిపోయే విందుగా నిలవనుంది. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో శర్వానంద్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు.
క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్‌గా కనిపించనున్నాడు. శ్రీను వైట్ల మార్క్ హ్యూమర్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
